బాన్సువాడ, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. నియోజకవర్గానికి లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు.
నిర్ణీత గడువు లోపల లక్ష్యాన్ని పూర్తి చేయాలి…. జిల్లా అధ్యక్షురాలు అరుణతార
పార్టీ కార్యకర్తలు నాయకులు తమకు ఇచ్చిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. సభ్యత్వ నమోదులో రాష్ట్ర నాయకత్వం ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా మండల అధ్యక్షులు, కన్వీనర్ల సహకారంతో సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు..
కార్యకర్తలు పోటీతత్వంతో సభ్యత్వ నమోదు చేయాలి…. రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ
నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పోటీ తత్వంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సభ్యత్వ నమోదులో అలసత్వం ప్రదర్శించకుండా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు అరుణతారా, మాజీ ఎమ్మెల్యే గంగారం, మోక్కా సురేష్, జిల్లా సభ్యత్వ కన్వీనర్ మోటూరి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు తూప్తి ప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు పైడి లక్మినారాయణ,నాయకులు చిదూర సాయిలు, కోణాల గంగారెడ్డి, రుద్రూర్, పోతంగల్, నసురుల్లాబాద్, చందూరు, మొస్ర , పోతంగల్, బీర్కూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ,ప్రకాష్ పటేల్, సాయికిరణ్,సున్నం సాయిలు,విఠల్,అనిల్, ఓబీసీ నాయకులు మాక్కన్న, నాగం సాయులు, మోహన్ రెడ్డి,సాయిరెడ్డి, శివ శంకర్, కొండని గంగారం, హన్మాండ్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.