బాన్సువాడ, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శనివారం తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్ మాట్లాడుతూ పట్టబద్రులుగా పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈనెల ఆరో తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్, కిష్టయ్య, నరసయ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.