బాన్సువాడ, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి 25 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా అష్టదశ శక్తిపీఠాలతో దుర్గామాతలు భక్తులకు దర్శనమిస్తుండడంతో భక్తులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు.
ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ప్రతిరోజు చండీ హోమం, కుంకుమార్చన, లలిత సహస్రనామాలతో పాటు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారులకు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పినట్లు అవుతుందని నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
గ్రామస్తులు ఐక్యమత్యంతో దేవీ నవరాత్రి ఉత్సవాలను జరపడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని గ్రామనికి చెందిన రామస్వామి భక్తులకు అన్నదాన దాతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.