బాన్సువాడ, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ డివిజన్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఉదయాన్నే గునుక, తంగేడు పూలను సేకరించి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఆడి పాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను భక్తితో కొలిచే పండుగ బతుకమ్మ పండుగని, మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందని, చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటామన్నారు.