బాన్సువాడ, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, నవరాత్రి ఉత్సవాలకు విగ్రహాదాతగా 30 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాన్ని అందిస్తు నాగులగామ వెంకన్న గుప్తా ప్రతి సంవత్సరం తన దాతృత్వాన్ని చాటుతున్నారన్నారు.
ప్రతిరోజు సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర నామాలతో పాటు దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.భక్తులకు మధ్యాహ్నం అన్నదానంతో పాటు సాయంత్రం అల్పాహార కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు అర్థం ప్రభావతి, వుడుగుల విజయ, నార్ల సుజాత, సంగీత, గంగ,కవిత, ధనలక్ష్మి, పవిత్ర, నార్ల భాగ్య, సుజాత ,సంధ్య, , నాగులగామ భారతి భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.