కామారెడ్డి, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అన్నారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం యొక్క సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ధాన్యం సేకరణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. తొలుత సి. ఎం. ఒ. అధికారికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్, మున్సిపల్ కమీషనర్ సుజాత, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, తదితరులు పాల్గొన్నారు.