కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దోమకొండ సంస్థానంలో రాజన్న చౌధరి (1700) తర్వాత 1948 వరకు 8 మంది రాజుల వివరాలు దొరుకుతున్నాయి. మరో ఆరుగిరి సమాచారం అస్పష్టంగా తెలుస్తున్నది.
రాజన్న దేశాయి కాలంలో చెన్నూరు రాజులతో జరిగిన యుద్ధంలో దేశాయి నైజాం పక్షం వహించాడు. 1985 లో రాజధాని దోమకొండకు మారింది. అది 1948 వరకు సాగింది. దేశాయి రాపాకా లక్ష్మిపతి కవిని పోషించాడు. లక్ష్మిపతి కవి ‘భద్రాయురభ్యుదయం’, శ్రీకృష్ణ విలాసము కృతులను రాశాడు.
5వ రాజు సోమేశ్వర రావు కాలంలో దోమకొండలోని హరిహర దేవాలయం కట్టించాడు. ఆ తర్వాత 100 సం.సంస్థానం సాధారణంగా కొనసాగింది. ఈ సంస్థానీకుల పోషణలో 1907లో ఆదిపూడి ప్రభాకర కవి ‘‘ఉమాపత్యభ్యుదయం’’ పేరిట దోమకొండ సంస్థానాధీషుల చరిత్ర రాశాడు. మరోక కవి చివుకుల వెంకటాచల శాస్త్రీ 1920లో ‘‘రామేశ్వర విలాసము’’ ను రాశాడు.
ఈ సంస్థానం ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తి రాజా రాజేశ్వర రావు ‘అస్గర్’. ఈయన స్వతహగా బహుభాషా పండితుడు ఈయన ఆస్థానంలో పెద్ద మందడి వెంకటకృష్ణ కవి ఉండేవాడు. ఈయన రాజలేఖ రాజవ్వ గారి జీవిత చరిత్ర (అస్గర్ గారి శ్రీమతి) రెడ్డికుల నిర్ణయ చంద్రికబీ కేశవ విలాసము, నిర్వచన భక్త విజయము గద్యాల సంస్థాన చరిత్రబీ మారుతి విలాసము కృతులు రాశాడు.
రాజా రాజేశ్వరరావ్ అస్గర్ సుమారు 125 పుస్తకాలు రాషారు. అందులో ఎన్నో నిఘంటువులు ఉన్నాయి. ఒక విశ్వవిద్యాలయం చేయవలసినంత పని ఆయనొక్కడే చేశాడు, 1939 లో ఆయన తుదిశ్వాస విడిచాడు. తర్వాత 1939 లో పాలన ప్రారంభించిన చివరి సంస్థానాధిషుడు శ్రీ రాజా సోమేశ్వర్రావు గారి కాలంలో సంస్థానం భారత యునియన్లో విలీనమయింది.