బాన్సువాడ, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతులు తాము పండిరచిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధర అందిస్తూ రైతాంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలేక్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, నాయకులు అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, నాగులగామ వెంకన్న గుప్తా, అసద్, పిట్ల శ్రీధర్,ఎజాస్, గుడాల నాగేష్ మోహన్ నాయక్, బోడ భాస్కర్, కొట్టం గంగాధర్, డైరెక్టర్ సాయిలు, నర్సుగొండ, లింగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.