కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, పాక్స్, తదితర శాఖల అధికారులతో వరి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండు,మూడు రోజుల్లో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తయిందని, కొనుగోళ్లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో 419 వరి కొనుగోళ్ళ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో 392 వ్యవసాయ పరపతి సంఘం (పాక్స్), 27 ఐ.కే.పి. కేంద్రాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన తేమ కొలిచే యంత్రం, టార్పాలిన్, గాని సంచులు, ఫ్లెక్సీ, త్రాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సి.ఏం.ఆర్. సేకరణ పూర్తి చేయాలని, మిలర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా సహకార అధికారి, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.