ఆర్మూర్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పొద్దుటూర్ వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మండలంలోని చేపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన చేపూర్ మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్ సోదరుడు పెద్ద రాజన్న, నూత్‌పల్లి రవి, కొనింటి వెంకటేష్, సారంగి మురళి, దుబ్బాక సుధాకర్, సూర్యునిడ రాజేశ్వర్‌ల కుటుంబ సభ్యులను ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డితో కలిసి పరామర్శించారు.
కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, ఆర్మూర్ జంబి హనుమాన్ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చిట్యాల పోశెట్టి, మాజీ ఉపసర్పంచ్లు డిష్ రాజు, కటికే శ్రీనివాస్, చాకలి వినోద్, సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగీ శాంతి కుమార్, న్యాయవాది సిదుకర్ చేరణ్, దాసరి నాగరాజు, మాజీ వార్డు మెంబర్ ఆరె రాజు, దుబ్బాక సాయన్న, సోక్కం సంజీవ్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు