కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యవసాయ రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు లక్ష్యానికి అనుగుణంగా, ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూన్ త్రైమాసిక నకు అంతమయ్యే జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు స్వల్ప, దీర్ఘ కాలిక ఋణాలు మరింత ఎక్కువగా మంజూరు చేయాలని అన్నారు.
సూక్ష్మ, మధ్య కాలిక ఋణాలు (ఏం.ఎస్.ఏం.ఈ) మంజూరు చేయాలన్నారు. ఇతర ప్రాధాన్యత ఋణాలు అయినటువంటి విద్యా ఋణాలు, ఇంటి ఋణాలు, సామాజిక మౌలిక సదుపాయాల ఋణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలకు లక్ష్యానికి అనుగుణంగా ఋణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకు లింకేజీ మొండి బకాయిలు ఒక ప్రణాళికాబద్ధంగా సమీక్షించి వసూళ్లు చేయాలని గ్రామీణాభివృద్ధి, పట్టణ (మెప్మా) అధికారులకు సూచించారు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు గతంలో సబ్సిడీ మంజూరు అయి బ్యాంక్ ఖాతాలలో జమ అయిన లబ్ధిదారుని యూనిట్లను యుద్ధప్రాతిపదికన గ్రౌండిరగ్ చేయాలని తెలిపారు. వివిధ కారణాల వలన దేవునిపల్లి, వాజిద్ నగర్, మిర్జాపూర్, కామారెడ్డి గంజ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచి లను కామారెడ్డి, బిచ్కుంద, బీర్కూర్, కామారెడ్డి బ్రాంచీలలో విలీనం ప్రక్రియ గురించి సమావేశంలో చర్చించారు.
సమావేశంలో ఆర్.బి. ఐ. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏం. జడ్. రెహమాన్, నాబార్డ్ డి.డి.ఏం. ప్రవీణ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా షెడ్యూల్ సంక్షేమ శాఖ అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, 23 బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.