నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశపు హల్ లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేశ్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్ రావు,నీలకంఠ రావు,రాజ్ కుమార్ సుభేదార్,విక్రమ్ రెడ్డి, జె.వెంకటేశ్వర్ గడుగు గంగాధర్ విద్యావేత్త డాక్టర్ హరికృష్ణ రెడ్డితో కలిసి ఓటరు నమోదు దరఖాస్తులను ఆవిష్కరించి మాట్లాడారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. స్వంత చిరునామా కలిగిన పరిధిలోని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేసి డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేసి సమర్పించాలని ఆయన సూచించారు. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా విలువైనదని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకుని మిగితా వారిని ఓటు అనే యజ్ఞంలో భాగస్వాములని చేయాలని జగన్ పేర్కొన్నారు