బాన్సువాడ, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో శనివారం గ్రామస్తులు ,యువకులు ఏకమై మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై గ్రామస్తులందరూ చర్చించి గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం జరపాలని గ్రామం మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. మధ్య నిషేధం ఈనెల 21 నుండి అమలులోకి వస్తుందని , గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపిన వారిపై 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
ప్రతి గ్రామంలో మద్యపానం వల్ల గొడవలు హత్యలకు దారితీస్తున్న మద్యపానాన్ని అరికట్టినట్లయితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూనేకర్ ప్రకాష్, మాజీ ఎంపిటిసి రమణ, మాజీ సర్పంచ్లు విట్టల్ సాయగౌడ్, సాయిలు, బీరప్ప, పోచయ్య, యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.