కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో కర్షక్ బిఎడ్ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు పదివేలకు పైగా ఉన్నారని అలాంటి చిన్నారులకు 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉందని ఇటీవల కాలంలో రక్తనిధి కేంద్రాలలో రక్తనిల్వలు లేకపోవడంతో చిన్నారులకు కావలసిన రక్తం దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,తలసేమియా సికిల్ సెల్ సొసైటీ సూచనల మేరకు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ శిబిరంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రక్తదాతలు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం జరిగిందని రక్తదానం చేసిన రక్తదాతలకు,సహకరించిన కళాశాలల యజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు 4000 వేల యూనిట్లపైగా రక్తాన్ని తలసేమియా చిన్నారులకు అందజేసి దేశంలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కామారెడ్డి రక్తదాతల సమూహానికి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) లకుచోటు దక్కడం జరిగిందని ఈ విజయానికి కారణం రక్తదాతలు, మీడియా ప్రతినిధులే అని అన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు డాక్టర్ వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్,ఉపాధ్యక్షులు జమీల్ హైమద్ డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, కిరణ్ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ దత్తాద్రి, సత్యనారాయణ హనుమంతరావు, విజయ్ కుమార్, నరేందర్ గౌడ్, రక్తదాతలు నిశాంత్ రెడ్డి, అంజల్ రెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.