డిచ్‌పల్లి, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్స్లర్‌గా సీనియర్ ప్రొఫెసర్ .టి .యాదగిరి రావు సోమవారం పరిపాలనా భవనం వైస్ -ఛాన్స్లర్ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, కంట్రోలర్, ఆడి సెల్ డైరెక్టర్, డీన్స్, హెడ్స్, చైర్మన్ బిఓఎస్‌ల తొ పాటుగా టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్‌గా నాపై నమ్మకంతో నియామకం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయ వనరులను ఉపయోగించుకొని బోధన బోధనేతర సిబ్బందిని ఉపయోగించుకొని, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారంతో న్యాకు గుర్తింపు తీసుకొచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాక్ గుర్తింపు లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.
కాన్వకేషన్ జరిపిస్తానని కాన్వకేషన్ ఏర్పాట్ల గురించి రిజిస్టార్‌తో చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాను ఈ తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యా డివిజన్లో కల్పించుటకు కృషి చేస్తానన్నారు.
పలు విభాగాలనుసందర్శించిన వైస్ ఛాన్స్లర్
నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, ఆడిట్ సెల్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌తో కలిసి పరిపాలన భవనం నందు పరీక్షల విభాగం, అడ్మిషన్స్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ సేవా విభాగం, ప్రజా సంబంధాల విభాగం, ఆడిట్ సెల్‌తో కళాశాలల బిల్డింగులు, లైబ్రరీ ని సందర్శించినారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు అందించారు.
పలు సంఘాల సన్మానం
నూతనంగా పదవి బాధ్యతలు ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావును తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్, పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్, అప్లియేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్, నాన్- టీచింగ్ అసోసియేషన్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ తో పాటు పలువురు బొకే శాలువాలతో ఘన సన్మానం చేశారు.