కామరెడ్డి, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినపుడు జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నెంబర్ 08468 220051 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు వచ్చినపుడు కంట్రోల్ రూం కు ఫిర్యాదు చేయ వచ్చని తెలిపారు.
కంట్రోల్ రూం లో అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, తదితరులు పాల్గొన్నారు.