బాన్సువాడ, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహనదారులు తప్పనిసరి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఎస్సై మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి వాహనదారులు వానానికి సంబంధించిన ద్రువపత్రాలతో పాటు, హెల్మెట్ తప్పనిసరి ధరించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి వాహనాలను ప్రమాదాలకు కావడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మోహన్, కానిస్టేబుళ్లు శంకర్,మోహన్, చిరంజీవి, కిరణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.