మాక్లూర్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్లో మంగళవారం కొమరం భీమ్ జయంతి సందర్భంగా మాణిక్ బండారు గ్రామ ప్రజలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని కొనియాడారు. మాణిక్ బండర్ గ్రామంలో మండల నాయకపోడ్ సంఘం మాజీ అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి.ఆకుల రవి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడ్ కుల పెద్దలు రాస సాయిలు, మంచిప్ప భూపతి, లక్ష్మణ్, రాము, మహేష్, సందీప్ తదితరులు ఆదివాసి నాయకపోడు సేవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.