డిచ్‌పల్లి, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టీ యాదగిరిరావు పేర్కొన్నారు. గురువారం పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ హల్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, బోధన సిబ్బంది, పరిశోధకులకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణకు, ల్యాబ్ల ఏర్పాట్లకు విద్యార్థుల ఫెలోషిపులకు న్యాక్ గుర్తింపు అనివార్యమైందని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని తెలిపారు.
ఈ గుర్తింపు ద్వారానే విశ్వవిద్యాలయాలకు భవన నిర్మాణ గ్రాంట్లతో పాటు మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక మద్దతు పొందవచ్చునన్నారు. సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధానంగా ఏ క్యూ ఏ ఆర్ రూపకల్పన గురించి సమగ్రంగా విభాగాధిపతులకు అవగాహన కల్పించారు.
సమావేశంలో పాల్గొన్న రిజిస్టార్ ఆచార్య.యం యాదగిరి మాట్లాడుతూ అధ్యాపకులు అందరూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగం పంచుకొని ఉన్నతమైన న్యాక్ గ్రేడ్ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. న్యాక్ గ్రేడ్ పొందడం కోసం బోధన బోధనేతర సిబ్బంది తమ శక్తి వంచన లేకుండా విధిగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య హారతి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, కంట్రోలర్ ఆచార్య అరుణ, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డాక్టర్ అడికే నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ డా.మావురపు సత్యనారాయణ రెడ్డి వివిధ విభాగాల విభాగాధిపతులు ఆచార్య రాంబాబు, ఆచార్య అపర్ణ, ఆచార్య సంపత్, ఆచార్య ఆంజనేయులు ఆచార్య లావణ్య, డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ భ్రమరాంబిక, డాక్టర్ రమణాచారి, డాక్టర్ లక్షణ చక్రవర్తి, డాక్టర్ ప్రసన్న శీల, డాక్టర్ ప్రసన్న రాణి డాక్టర్ జబీర్ అహ్మద్, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.