రుణాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సంప్రదాయ పంటల సాగుతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం మాచారెడ్డీ మండల కేంద్రంలోని డ్రాగాన్‌ పండ్లతోట, కొత్త పల్లి గ్రామంలోని నర్సరీ, సోమార్‌ పేట్‌ లోని వరి ధాన్యం కేంద్రం, మాచారెడీ లోని సారీ సెంటర్‌, లక్ష్మీ రావుల పల్లి లోని డైరీ ఫాం లను కలెక్టర్‌ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు.

మహిళా సంఘం నుండి 3 లక్షల రూపాయలు రుణం తీసుకుని డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుచేయడం జరుగుతున్నదని తెలిపారు. ఒకసారి పంటను వేస్తే 20 సంవత్సరాల పాటు పంట వస్తుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లి లోని పట్టు పురుగుల యూనిట్‌ ను కలెక్టర్‌ పరిశీలించారు. అదే గ్రామంలో నాలుగు ఎకరాల భూమిలో కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం చేపడుతున్న బోడ శ్రీకాంత్‌ తన తల్లి పేరున మహిళా సంఘం నుండి లక్ష రూపాయలు రుణం తీసుకుని పంటల సాగు చేసున్నానని తెలిపారు.

సంవత్సరానికి సుమారు 5 నుండి ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నమని , తన కుటుంబ సభ్యులే పనులు చేస్తున్నారని కలెక్టర్‌ కు తెలిపారు. అనంతరం సొమార్‌ పేట్‌ లో ఐ.కే. పి. వారిచే వరి ధాన్యం కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. వరి ధాన్యాన్ని ఆర బెట్టి కేంద్రానికి తీసుకు వచ్చే విధంగా రైతులకు తెలియజేయాలని అన్నారు. గోదాం నిర్మాణానికి మహిళా సంఘానికి భూమి కేటాయించాలని గ్రామస్తులు కోరారు.

అనంతరం మాచా రెడ్డి గ్రామంలో మహిళా సంఘం నుండి, బ్యాంక్‌ లింకేజ్‌ క్రింద 3.75 లక్షల రుణం తీసుకొని సారీ సెంటర్‌, చెప్పుల దుకాణం నడిపిస్తున్న తస్లీమా బేగం దుకాణాన్ని కలెక్టర్‌ సందర్శించి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ రావుల పల్లె గ్రామంలోని తుమ్మ రవళి మహిళా సంఘం నుండి రుణం తీసుకొని పాల ఉత్పత్తి, వ్యాపారం ప్రారంభించిన వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజూ 12 లీటర్ల పాలు తీస్తున్న మని, ప్రతీ పది రోజులకు రు. 7500/- సంపాదిస్తున్నామని తెలిపారు.

బ్యాంకు లింకేజ్‌ క్రింద తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆదాయ మార్గాలు ఎంచుకొని ఆ దిశగా వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు.

కార్యక్రమాలలో ఆర్డీఓ రంగనాథ్‌ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్‌ అధికారి శ్రీనివాస్‌ రావు, డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రమేష్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ రాజేందర్‌, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహ రావు , తహసీల్దార్‌ శ్వేత, ఎంపీడీఓ , తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »