డిచ్‌పల్లి, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్‌లో గురువారం వైస్ ఛాన్స్లర్ ఆచార్య.టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా అన్ని విభాగాలలో తరగతి గదులలో బోధనా జరుగుచున్న తీరును పర్యవేక్షించినారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని విభాగాధిపతులకు సూచించారు. అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని అనుమతితో మాత్రమే సెలవులను వాడుకోవాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వైస్ -ఛాన్స్లర్ టి యాదగిరిరావు పేర్కొన్నారు.
తనిఖీలో వైస్ -ఛాన్స్లర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి వివిధ విభాగాధిపతులు ఉన్నారు.