కామారెడ్డి, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను సంబంధిత సబ్జెక్టు పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
కళాశాలలో ఉన్న పనికి రాని స్క్రాప్ ను నిబంధనల మేరకు తొలగించాలని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ గదిలో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, బోధన అంశాలపై ప్రిన్సిపాల్ కే.విజయ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, లెక్చరర్స్ పాల్గొన్నారు.