నిజాంసాగర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజాంసాగర్ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలం నిజాంసాగర్ డ్యామ్ వద్ద ఎకో టూరిజం పనులకు సంబంధించిన వాటిపై టూరిజం అసిస్టెంట్ మేనేజర్ రాజు, కన్సల్టెంట్ హరి లతో కలెక్టర్ మాట్లాడారు.
ప్రతిపాదించిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. భూమికి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని తహసీల్దార్ భిక్షపతిని ఆదేశించారు.