ఆర్మూర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గంగ దినేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు.
దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సంతోష్, తిరుమల సుజాత, బ్రీడిరగ్ చెక్కర్స్ నరేందర్, రఫిక్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.