డిచ్‌పల్లి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ కబడ్డీ మెన్ సెలెక్షన్స్ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో నిర్వహించినట్టు వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా జి బాలకిషన్ తెలిపారు.
ఈ సెలెక్షన్స్ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులు సందీప్, ఎస్ ఆర్ న్ కె బాన్స్వాడ , ఆకాష్, గోవింద్, శివ, మనోహిత్, నర్సింహా మోహిత్ యూనివర్సిటీ కాలేజీ సిద్దార్థ్, నరేష్, నరేష్ గిరిరాజ్ కాలేజీ శివ ఎస్ఎసల్ బాన్స్వాడ సందీప్ జి డి సి కామారెడ్డి అభిలాష్ మోర్తాడ్ కార్తీక్ ఎస్ ఎస్ ఆర్, సాయికుమార్ జీడీసి ధర్పల్లి విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన వర్సిటీ కబడ్డీ టీం చెన్నై లో జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ లో 29.10.2024 నుండి 04.11. 2024 వరకు జరుగు టోర్ని లో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత తెలిపారు. సెలెక్షన్స్ లో జి జి కళాశాల, వివిధ కళాశాలల పి.డీలు డాక్టర్ బాలమణి, డాక్టర్ కుమారస్వామి, ప్రశాంత్, బుచ్చన్న వివిధ కళాశాలల ఇంచార్జి లు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ టోర్ని ప్రారంభానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి,డైరెక్టర్ (పిఆర్‌ఓ) డా.ఏ.పున్నయ్య,చీఫ్ వార్డెన్ డా.ఐలేని మహేందర్ తదితరులు పాల్గొననున్నారు.