టపాకాయల దుకాణదారులు అనుమతి తీసుకోవాలి..

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

దీపావళి వండుగ నందర్చంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా నంబంధిత డివిజినల్‌ స్థాయి పోలీస్‌ అధికారుల పోలీస్‌ అనుమతి తీనుకోవాలని ఇంచార్జీ సి.పి ఒక ప్రకటనలో వెల్లడిరచారు.

ఎవ్వరయిన సంబంధిత పోలీస్‌ డివిజినల్‌ స్థాయి అధికారి నుండి అనుమతిలేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్‌ప్లోజివ్‌ యాక్టు – 1884 మరియు రూల్స్‌ – 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొనబడుతాయన్నారు.

టపాకాయల దుకాణాదారులు తవృక ఈ క్రింది నిబంధనలు పాటించాలన్నారు.

టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి నంబంధించిన ఎన్‌.ఓ.సి నర్జిఫికేటు పొందపర్చాలన్నారు.

ఒక క్లన్టర్‌లో 50 షావులకు మించరాదని, జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదని, అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు నమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదన్నారు.

తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్‌కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

దరభాన్తు ఫారం వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్‌ చేసుకొని వూర్తి వివరాలతో సంబంధిత ఎ.సి.పి కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »