నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
29న మంగళవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ భవనంలో బీసీ కమిషన్ సభ్యులు బిసి కులస్తులను కలవనున్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులకు ప్రతి బీసీ కుల సోదరులు కలిసి తమ తమ సమస్యలను తమ డిమాండ్లను విన్నవించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో బీసీల విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు తమ తమ డిమాండ్లను సమస్యలను వినతి పత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు కోరారు.
రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ కమిషన్ చేసే పర్యటన అత్యంత కీలకమైనది, ఈ పర్యటన ద్వారానే మన బీసీ కులగణన జరిగి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మనమెంతో మనకు అంత వాటా రానున్నది అని మరో రాష్ట్ర నాయకులు ఆకుల ప్రసాద్ అన్నారు. మనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలంటే బీసీ కమిషన్‌కు మన సమస్యలను మన డిమాండ్లను తెలుపుకోవాలని నరాల సుధాకర్ అన్నారు.
ఈ పర్యటనలో బీసీ మేధావులు ఉద్యోగులు, విద్యార్థులు యువజన మహిళ మరియు ప్రతి కుల సంఘ నాయకులు పాల్గొని తమ సమస్యలను పత్రాలు రాసుకొని ఆరు జిరాక్స్ సెట్లను తీసుకొని రావాలని తెలిపారు. కార్యక్రమంలో పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కరిపే రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, రంగన్న, చంద్రకాంత్, సంజీవి, సాయి బసవ, లక్ష్మీనారాయణ రాజు, సుదర్శన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.