కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి సిపిఎం నాయకులు వెళ్ళినప్పుడు మెట్ల మీద నుండి కిందకు దింపి దూరం ఉండి మాట్లాడాలి దగ్గరికి రావద్దు నాకు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ అవమానకరంగా మాట్లాడి కించపరిచారని దానికి నిరసనగా కలెక్టరేట్ డోర్‌కి వినతిపత్రం ఇచ్చామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె. చంద్రశేఖర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెగ్యులర్‌గా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని ఇప్పటికే వాటిపై అనేకసార్లు ఆసుపత్రి మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే మళ్లీ ఆస్పత్రులు రీఓపెన్ కావడం ఏందని ప్రశ్నించారు. ఆస్పత్రికి అండగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. దీని విషయమై కలెక్టర్‌కి వినతి పత్రం ఇద్దామంటే దగ్గరికి రావద్దు దూరం ఉండే మాట్లాడండి అని వివక్ష చూపినట్లు ఆయన ప్రవర్తించడం ప్రజావాణికొచ్చే ప్రజల పట్ల ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలెక్టర్ మీద విచారణకు ఆదేశించాలని కోరుతున్నామని అన్నారు.
అదేవిధంగా వెంటనే లింగ నిర్ధారణ పరీక్షలకు ప్రోత్సాహం ఇస్తూ పరీక్షలు చేస్తున్న అన్ని ఆసుపత్రులపై విచారణలు జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకొని వారి యొక్క లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట గౌడ్ పాల్గొన్నారు.