బాన్సువాడ, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పక్కాగా చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్యుమారెటర్స్, సూపర్వైజర్స్ సమగ్ర సర్వే చేపట్టేటప్పుడు పాటించాల్సిన సూచనలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, అధికారులు కిషన్, వెంకటరమణ, మేనేజర్ మల్లికార్జున్, ఏఈ శ్రీకాంత్, తుల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.