కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన భూసరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరూప (45) కు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాత్సల్య రక్త సొసైటీలో 9వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీల కోసం,వివిధ ఆపరేషన్ల నిమిత్తమై రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతగా నిలిచిన రక్తదాత భూస రాజుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. రాజును స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి యువత ముందుకు రావాలని రక్తదానం ప్రాణదానంతో సమానమే అని అన్నారు.