కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలోని ఎస్.సి.బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ, వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతీ రోజూ చేస్తున్న దినచర్య, బోధన, చదువు, గేమ్స్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండి, మంచి విద్యను అభ్యసించి, ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు చేయాలని అన్నారు. వసతి గృహంలో ఉన్న విద్యార్ధులకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. అనంతరం విద్యార్థుల పడక గదులు, ఇతర గదులను కలెక్టర్ పరిశీలించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా ఎస్.సి. సంక్షేమ అధికారిని రజిత, సహాయ . సంక్షేమ అధికారి వెంకటేష్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి యాదగిరి, తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.