కామారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో బుధ వారం ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరం వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంక్ పూచీకతు తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కోరారు.
అలాగే మిల్లర్లు ధాన్యాన్ని తొందరగా మిల్లులో దించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మిల్లర్లూ, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.విక్టర్, జిల్లా మేనేజర్ రాజేందర్, డి.సి.ఎస్.ఓ.నరసింహారావు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.