దీపావళి సందర్భంగా అగ్నిమాపక అధికారి పలు సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలిపారు.

పిల్లలు జాగ్రత్తలు ఒకసారి కాల్చిన టపాసులు మళ్లీ కాల్చకూడదని టపాసులు ఒకదాని తర్వాత ఒకటి కాల్చాలని టపాసులు కాల్చేటప్పుడు సురక్షితంగా దూరం పాటించగలరని పేర్కొన్నారు. ఇంటిలోపటల టపాసులు కాల్చకూడదని మరియు మండే స్వభావం గల పదార్థాల వద్ద టపాసులు కాల్చవద్దని పేలని టపాసులు మళ్లీ కాల్చకూడదని ఒకవేళ టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా సంభవాలు జరిగితే వెంటనే సంబంధిత ఆస్పత్రిని సందర్శించాలని వివరించారు.

కార్యక్రమంలో సయ్యద్‌ మహమ్మద్‌ అలీ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »