ఆర్మూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »Monthly Archives: October 2024
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులు నేం.44, 161 ల పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను …
Read More »ఆసుపత్రులను తనికీ చేయాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆసుపత్రులను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ కోసం అనుమతులకు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్, చైర్మన్, జిల్లా రిజిస్ట్రేషన్ అధారిటీ కమిటీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రతిపాదనలను సంబంధిత అధికారులు చట్టం …
Read More »మాణిక్ బండార్‌లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు
మాక్లూర్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్‌లో మంగళవారం కొమరం భీమ్ జయంతి సందర్భంగా మాణిక్ బండారు గ్రామ ప్రజలు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని కొనియాడారు. మాణిక్ బండర్ గ్రామంలో మండల నాయకపోడ్ సంఘం మాజీ అధ్యక్షులు, మండల …
Read More »హన్మజీపేట్‌లో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ
బాన్సువాడ, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడానికి హక్కుల కోసం పిడికిలెత్తిన కొమురం భీం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు …
Read More »నాలుగు సెక్షన్‌లకు ట్రాన్స్ కొ ఏఈలు భాధ్యతలు స్వీకరణ
నందిపేట్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ కొ సాధారణ బదిలీలలో భాగంగా నాలుగు సెక్షన్‌లకు అసిస్టెంట్ ఇంజినీర్‌లుగా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారని నందిపేట్ ఏ. డి. ఈ అశోక్ తెలిపారు. నూత్పల్లి సెక్షన్ కు జీ రమేష్, నందిపేట్ కు తూము రవి, మాక్లూర్ కు మిథున్, గోటుముకల కు సయ్యద్ ఇలియాస్ హేమద్ లు బాధ్యతలు తీసుకున్నారని అశోక్ తెలిపారు.
Read More »న్యాయవాదూల సంక్షేమం కోసం కృషి…
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్ట భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎంఎల్‌సి ఎన్నికల్లో …
Read More »రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న పోలీసు ఉద్యోగి
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని …
Read More »దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్ యువకుడు
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్ రాజ్ (32) అనే యువకుడు ఉద్యోగం కోసం విజిట్ వీసాపై దుబాయికి వెళ్లి జాడ తెలియకుండా పోయిన సంఘటన జరిగింది. ఈ నెల 14న దుబాయికి చేరుకున్న తమ కుమారుడు రాహుల్ 19న తన బ్యాగ్ దొంగలు కొట్టేశారని అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తమకు ఫోన్‌లో చెప్పాడని, ఆ …
Read More »తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆచార్య. టి. యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని అందుకే అత్యంత పారదర్శకంగా విద్యా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్యులను మాత్రమే …
Read More »