హైదరాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట కు చెందిన బదనపల్లి సాయన్న అనే పేషేంట్ ను కంపెనీ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది.
మేము పేదవాళ్లం ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు భరించే స్థోమత లేదు. నిమ్స్ హాస్పిటల్లో అడ్మిషన్ ఇప్పించి, ఉచిత వైద్యం అందించాలని పేషేంట్ భార్య ప్రేమల, కుమారులు వికాస్, వినీత్ లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రేస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కోమా పేషేంట్ను ఖతార్ నుంచి ఇండియాకు తెప్పించడం, నిమ్స్ అడ్మిషన్ కోసం కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి రెడ్డి సమన్వయం చేస్తున్నారు.