నందిపేట్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండల్ జోరుఫూర్ గ్రామంలో ఆరు నెలల క్రితం దుబాయ్‌లో మరణించిన మచ్చర్ల బోజన్నకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన గల్ఫ్ లో మరణించిన వారికి ఎక్స్ గ్రేసియా అయిదు లక్షల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో 36 మంది గల్ఫ్‌లో చనిపోయారు. అందులో 11 మందికి ఆర్మూర్ అసెంబ్లీ లో ఎక్స్ గ్రేసియా మంజూరు అయినది. అందులో భాగంగా ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నందిపేట్ మండల్ జోర్పూర్ గ్రామానికి చెందిన మచ్చర్ల బోజన్న సతీమణి మచ్చర్ల లక్ష్మికి ఎక్స్ గ్రేసియా మంజూరీ పత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుక్కన్న, దమ్మాయి శ్రీను, కదిర్, ప్రభుదాస్, కంతం చిన్నయ్య, మన్నె సాగర్, ఎడ్డీగారి నిఖిల్, మేర శ్రీను, సాయి కుమార్, జోర్పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.