బాన్సువాడ, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఆర్టీసీ డిపోలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులు శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని పిఓ పద్మా అన్నారు. ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని పిఓ పద్మ, స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో ఉద్యోగులకు అన్ని రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, బిపి మొదలగు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం తార్నాక ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టిసి అధికారులు జనాభాయ్, కిష్టయ్య, సూపర్డెంట్ బసంత్, జగదీశ్వర్, ఆరోగ్య సిబ్బంది సంతోష్, విజయ,శ్రావ్య, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.