నందిపేట్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేటలో అన్ని గ్రామాలలో తెల్ల కల్లు ధర ఒకేసారి మూడు రూపాయలు ముస్తేదార్లు పెంచారు. ఒక్క సీసాకు ముందు 12 రూపాయలు వసూలు చేసేవారు. దాన్ని ఒకేసారి 15 రూపాయలకు ఫెంచారు. లేకుంటే కల్లు అమ్మడం నిలిపి వేస్తాం, ఊరిమీదికి దబ్బులు పెంచి ఇస్తాం… అని కళ్ళు ముస్తేదారులు ఖరాకండిగా చెప్పడం ఆయా గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక విధిలేక ఊరకుండిపోతున్నారు.
నీళ్ల కల్లుకు ఇంత రేటా… బహిరంగంగా గ్రామాలలో వేలం పాటలు జరుగుతున్న ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడం విచారకరం. కల్లు తాగకపోతే మతిస్థిమితం లేని వాళ్ళ లాగా ప్రజలు ప్రవర్తిస్తారు. అందుకే సడీ చప్పుడు చేయకుండా కల్లు తాగుతున్నారు. దీనినే కల్లు ముస్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల బలహీనతలపై దెబ్బ కొడుతున్నారు. ఇకనైనా ధర తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.