కామారెడ్డి, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అదనంగా హమాలీలను నియమించు కోవాలని అన్నారు.
వరి ధాన్యంలో చెత్త లేకుండా జల్లెడ (ప్యాడి క్లీనర్) పెట్టాలని తెలిపారు. కొనుగోలు చేసే ముందు ధాన్యం తేమశాతం కొలవాలని తెలిపారు. ధాన్యం తూకంలో ఎలాంటి వ్యత్యాసం రాకుండా ప్రతీ బస్తా 40.600 కిలోలు తూకం వేయాలని అన్నారు. తూకం వేసిన బస్తాలను లారీల్లో నింపి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, తహసీల్దార్ జనార్ధన్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.