కామారెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సైబర్ జాగృత దివస్ సందర్బంగా బుధవారం సైబర్ క్రైమ్ డిఎస్పి, స్టాఫ్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం కామారెడ్డిలో నిర్వహించారు.
ఈ సందర్బంగా నకిలీ పోలీసు కాల్స్, మ్యూల్ ఖాతాలు, కంబోడియా దేశంలో మానవ అక్రమ రవాణా, ఏపికె ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్, డిజిటల్ అరెస్టుల కుంభకోణాలు, ఇన్వెస్ట్మెంట్స్ (స్టాక్) మోసాలు, డయల్ 1930 ప్రాముఖ్యత, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సైబర్ డిఎస్పి శ్రావణ కుమార్, కానిస్టేబుల్ ప్రవీణ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.