ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటు హక్కు వినియోగించుకోవడం పై 2024 సంవత్సరంలో ఓటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. మీడియా హౌస్‌ల నుండి 2024 సం.నకు ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డుకు నామినేషన్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ప్రచార నాణ్యత, ఖచ్చితత్వం, ప్రజా పరిజ్ఞానం, ఓటర్లకు సరైన సమాచారాన్ని అందించడం, ప్రత్యేక కథనాలు, చర్చలు వంటి అంశాల ఆధారంగా అవార్డులను నిర్ణయిస్తారని, ప్రతి విభాగంలో పాల్గొనే సంస్థలు తమ ప్రచారం యొక్క సారాంశం, ప్రచురణ లేదా ప్రసారం యొక్క వార్త ఇతర సంబంధిత ప్రచార కార్యకలాపాలతో సహా నిజ ప్రతులను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌ 10వ తేదీ (10.12.2024) లోగా తమ సిఫార్సును రాజేష్‌ కుమార్‌ సింగ్‌, అండర్‌ సెక్రటరీ (కమ్యూనికేషన్‌), ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్వచన్‌ సదన్‌, అశోక రోడ్‌, న్యూ ఢల్లీి…110001 చిరునామాకు పంపాలని సూచించారు. ఈ-మెయిల్‌ ద్వారా ఎవసఱa-సఱఙఱంఱశీఅఏవషఱ.స్త్రశీఙ.ఱఅ కు పంపవచ్చని, హిందీ లేదా ఇంగ్లీష్‌ కాకుండా ఇతర భాషలలో ఉన్నట్లైతే ఆంగ్ల అనువాదాన్ని కూడా జతపరచాలని కలెక్టర్‌ తెలిపారు.

ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన 2024 ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డుకు గాను క్రింది చూపిన నిబంధనలు, షరతులు వర్తిస్తాయని అన్నారు. ప్రింట్‌ మీడియా, టెలివిజన్‌, రేడియో, ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియా విభాగాల్లో  అవార్డులు అందిస్తారని, ప్రతి విభాగంలో ఉన్నత ప్రమాణాలు, ప్రసార సమయం, సామర్థ్యం, ప్రజలపై చూపిన ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ప్రింట్‌ మీడియా ప్రచురించిన వ్యాసాల సంఖ్య, ఆర్టికల్స్‌ ప్రచురించిన ప్రింట్‌ ఏరియా స్క్వేర్‌ సెంటీమీటర్లు, మరియు పాఠకులలో అవగాహన కల్పించేందుకు చేసిన కార్యక్రమాల సమాచారాన్ని పిడిఎఫ్‌ సాఫ్ట్‌ కాపీ/వెబ్‌ అడ్రస్‌ లింక్‌/ఫుల్‌ సైజ్‌ ఫోటో కాపీ/ న్యూస్‌ పేపర్‌ ప్రింట్‌ కాపీ/ఆర్టికల్స్‌ సమర్పించాలని తెలిపారు.

టెలివిజన్‌, రేడియో ఎంట్రిలకు ప్రసారమైన కార్యక్రమం యొక్క వ్యవధి, ఫ్రీక్వెన్సీ, మొత్తం ప్రసార సమయం వివరాలను సిడి, డివిడి లేదా పెన్‌ డ్రైవ్‌ ద్వారా సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియా పోస్ట్‌లు, బ్లాగ్‌లు, ట్వీట్‌లు, లేదా ఇతర సోషల్‌ మీడియా ప్రచారాల సమీక్షను, మరియు వాటి ప్రభావం వివరాలతో పిడిఎఫ్‌ సాఫ్ట్‌ కాపీ/వెబ్‌ అడ్రస్‌ లింక్‌/ ఆన్లైన్‌ యాక్టివిటీ వివరాలు సమర్పించాలని సూచించారు. 2024 సంవత్సరం లోనే ప్రసారం, ప్రచురణ లేదా ఆన్‌లైన్‌లో పోస్టు చేయబడాలని, ఇతర భాషలలో సమర్పించినట్లైతే ఆంగ్ల అనువాదం తప్పనిసరి అని తెలిపారు.

ప్రతి ఎంట్రీ కి సంస్థ పేరు, చిరునామా, టెలిఫోన్‌, ఫ్యాక్స్‌ నంబర్లు, ఈ-మెయిల్‌, తదితర పూర్తి వివరాలతో 10 డిసెంబర్‌ 2024 లోగా పంపాలని పేర్కొన్నారు. ప్రతి ఎంట్రీని ప్రచారం నాణ్యత, సరికొత్త ప్రచార పద్ధతులు, ప్రజలపై సాధించిన ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఆమోదిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »