నిజామాబాద్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు.
రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం నిర్ణయం మేరకు ఆయా గ్రూపుల విద్యార్థుల పరీక్ష ఫీజులను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరిగిందని ఆ మేరకు విద్యార్థులు ఫీజులను ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ, ఇతర అన్ని రకాల రెసిడెన్షియల్ విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజులను ఈ నెల 26వ తేదీ లోపల ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని అన్నారు.
వంద రూపాయల అపరాధ రుసుము మొదలుకోనీ, 2 వేల రూపాయల అపరాధ రుసుము తో డిసెంబర్ 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షకు ఒకేషనల్ విద్యార్థులకు 750, ఆర్ట్స్ కోర్సులకు 520 రూపాయలు, సైన్స్ విద్యార్థులకు 750 రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సప్లిమెంటరీ విద్యార్థులు అదనంగా మరో 520 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం ప్రాక్టికల్ ఫెయిల్ అయిన వారు మరో 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి అన్నారు.