డిచ్‌పల్లి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హర్యానా రాష్ట్రంలోని రివరి జిల్లా మీరార్యారులో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన ఎన్‌ఎస్‌ఎస్ వాలెంటర్లును తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరి రావు అభినందించారు. 16 రాష్ట్రాల నుంచి 200 మంది వాలెంటర్లు పాల్గొన్నగా కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ మరియు అనుబంధ కళాశాల విద్యార్థులు నాలుగు పతకాలు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు వలన వివిధ ప్రాంతాలలోని మనుషుల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతాయని జీవన విధానం మారుతుందని కులం మతం సంబంధాలు లేకుండా భారత వసుదైక కుటుంబంగా పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.
సంగీతం పాటలు నృత్యాలు డ్రామా వంటి కార్యక్రమాలు ప్రజల ఆలోచన విధానాన్ని మారుస్తాయని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి వాలెంటర్లను అభినందించారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వాలంటీర్లు ప్రదర్శించిన బోనాలు బతుకమ్మ పండుగలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయని ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. శిబిరంలో అనిల్, శ్రావణ్, హర్షిని, రాజేశ్వరి, హిరమణి పాల్గొన్నారు.