నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయవాది నరేందర్‌ను గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదిగా ఉన్న నరేందర్ భవిష్యత్తులో అనేక పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్‌తో పాటు సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాది పిల్లి శ్రీకాంత్, నారాయణదాసు, పరుచూరి శ్రీధర్, నారాయణ, పులి జైపాల్, ఆర్ఎస్ఎల్ గౌడ్, కేశవులు, సుదర్శన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.