సీఎం రేవంత్‌ జన్మదినం నవంవర్‌ 8ని ‘తెలంగాణ ప్రవాసి దివస్‌’ గా ప్రకటించాలి

హైదరాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల సంక్షేమంలో భాగంగా ‘ప్రవాసీ ప్రజావాణి’ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి జన్మదినం సందర్బంగా శుక్రవారం టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు మంద భీంరెడ్డి, బొజ్జ అమరేందర్‌ రెడ్డి కృతజ్ఞతాపూర్వకంగా ప్రజాభవన్‌ను సందర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జన్మదినం నవంబర్‌ 8ని ‘తెలంగాణ ప్రవాసీ దివస్‌’ గా ప్రకటించాలని వారు కోరారు. 15 లక్షల గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల పక్షాన… గల్ఫ్‌ ఆత్మ బంధువు రేవంత్‌ రెడ్డికి వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం జరిగిన ‘ప్రవాసీ ప్రజావాణి’ కి వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి కి చెందిన వొంటరి నర్సారెడ్డి 2020 లో సౌదీ అరేబియా రియాద్‌ అల్‌ జోఫ్‌ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఉద్యోగ అనంతర ప్రయోజనాలు, ప్రమాద పరిహారం ఇప్పించాలని అతని కుమారుడు వినతి పత్రం సమర్పించారు.

లక్షా 20 వేల రూపాయలు చెల్లించి దుబాయికి విజిట్‌ వీసాపై వెళ్లి ఉద్యోగం లభించక వాపస్‌ వచ్చిన ఒక హైదరాబాద్‌ యువకుడు ఏజెంట్‌ నుంచి డబ్బులు వాపస్‌ ఇప్పించాలని వినతిపత్రం సమర్పించాడు. మృతి చెందిన తన సోదరుడి అంత్యక్రియలకు కెనడా నుంచి ఇండియాకు వచ్చిన తాను ఇక్కడే చిక్కుకుపోయానని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ప్రదీప్‌ సాదుల వినతిపత్రంలో తెలిపారు. వర్క్‌ పర్మిట్‌ పొందే విషయంలో సాయం చేయాలని, కెనడాలో ఉన్న తన భార్య వద్దకు తనను చేర్చాలని కోరారు.

సైబర్‌ ముఠా చేతిలో బందీగా మయన్మార్‌ లో చిక్కుకున్న హైదరాబాద్‌ చార్మినార్‌ ప్రాంతవాసి ముస్తఫా ఉల్లా ఖాన్‌ ను రక్షించాలని అతని తండ్రి కోరాడు. గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదు ప్రగతిని తెలుసుకోవడానికి అతని తండ్రి వచ్చాడు. ఫిబ్రవరిలో బహరేన్‌ లో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌ వాసి నిమ్మల రాజు భార్య గతంలో తాను రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా కోసం ఇచ్చిన దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి వచ్చారు.

పెళ్లి చేసుకొని భార్యను ఇక్కడే వదిలేసి జిద్దా, సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన హైదరాబాద్‌ వాసి ఈశానుల్లా ఖాన్‌ పై గతంలో చేసిన ఫిర్యాదు ప్రగతిని తెలుసుకోవడానికి అతని భార్య వచ్చారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »