డిచ్‌పల్లి, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు బాలుర పాత మరియు కొత్త వసతి గృహాలను చీఫ్ వార్డెన్ డాక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డెన్ డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్ కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు రెండు వసతిగృహంలోని విద్యార్థులను మెస్ కమిటీలతో సమావేశమై ప్రధానమైన సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హమీ ఇచ్చారు. చీఫ్ వార్డెన్ మహేందర్ రెడ్డి హాస్టల్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతు సమయపాలనతో పాటు హాస్టల్లో శుభ్రంగా ఉంచాలని నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో వివిధ బాలుర వసతి గృహాల సంబంధించిన మెస్ కమిటీ సభ్యులు కేర్ టేకర్స్, హాస్టల్ సిబ్బంది తదితర విద్యార్థులు పాల్గొన్నారు.