బాన్సువాడ, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులతో పోలీస్ స్టేషన్ వచ్చిన నాగరాజు డబ్బులు ఇవ్వడానికి వస్తున్నానని ఎస్ఐని సంప్రదించగా స్టేషన్ కార్యాలయంలోని రైటర్‌కు ఇవ్వాలని చెప్పగా మీకే ఇస్తానని బాధితుడు చెప్పడంతో స్టేషన్ నుండి బయటకు వెళ్తున్న ఎస్సైకి 20 వేల రూపాయలు బులేరో వాహనం వద్ద ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బాధితుడు నాగరాజు చెప్పిన విధంగా కార్యాలయంలోని రైటర్‌కు డబ్బులు ఇచ్చినట్లయితే అతను కూడా కేసులో ఇరికేవాడని పలువురు చర్చించుకుంటున్నారు.