నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా ఇందూరు నగరంలో ఈ ఆదివారం మహా పథసంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం ప్రకటనలో తెలిపారు.
10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఖిల్లా రామాలయం, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, శంకర్ భవన్ ఈ మూడు చోట్ల నుంచి వేరువేరుగా పథ సంచలన్లు (ర్యాలీ) ప్రారంభమై నగర పురవీధుల గుండా కవాతు చేసి శివాజీ నగర్ లోని శివాజీ చౌక్ వద్ద మూడు వేరువేరుగా ఉన్న సంచలనం లు త్రివేణి సంగమంగా ఒకే చోట కలిసే సుందర దృశ్యాన్ని తిలకించేందుకు సమస్త ఇందూరు హిందువులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
సంచలన్ అనంతరం శివాజీ నగర్ ఐటిఐ కళాశాల మైదానంలో సార్వజనికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, ప్రధాన వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ కల్ప గురి ప్రభు కుమార్ విచ్చేస్తున్నట్టు తెలిపారు.
సార్వజనికోత్సవంలో స్వయంసేవకుల శారీరక ప్రదర్శనలు ఉంటాయని ప్రేరణదాయకమైన సందేశాన్ని వినేందుకు ప్రజలందరూ భారీ ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా కోరుతున్నట్టు తెలిపారు.