అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సర్వే

నిజామాబాద్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడిరచారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేసుకుని శనివారం నుంచి ఇంటింటి సమగ్ర సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని అన్నారు. సర్వేపై ప్రజలతో మమేకం అయితే వారి సందేహాలు ఏమిటి అనేవి తెలుస్తాయని, తక్షణమే వాటిని నివృత్తి చేయడానికి చొరవ చూపాలన్నారు.

ప్రజలు ఎలాంటి అపోహలకు లోనవకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేలా వారిని ఆహ్వానించాలని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించేందుకు సర్వే దోహదపడుతుందని తెలిపారు. హౌస్‌ లిస్టింగ్‌ దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆసాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్నారని భాగస్వామ్యం అయిన కలెక్టర్లను, ఎన్యూమరేటర్లు ను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఇంటింటి కుటుంబ సర్వే మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ సర్వే విజయవంతం చేయాలని అన్నారు. యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తున్నదని, నిబద్ధతతో సర్వే పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

సర్వే సమాచారం గ్రామ స్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు.

ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు. ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని అన్నారు. సర్వేపై ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎంపిడిఓ, తహశీల్దార్ల దృష్టికి తేవాలని అన్నారు.

సమగ్ర సర్వే నిర్వహించడానికి ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, సీపీఓ మల్లికార్జున్‌, ఆర్డీఓలు రాజేంద్రకుమార్‌, రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Print 🖨 PDF 📄 eBook 📱 ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »