బాన్సువాడ, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు.
ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు తెలియజేయడానికి డిపో మేనేజర్ 9959226020 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.